KTR | హైదరాబాద్ : నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులు చేసేవారిపై పోరాటం చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం ఉందని, తప్పకుండా నిజం గెలుస్తుందనే విశ్వాసం ఉందన్నారు కేటీఆర్.
మంత్రి కొండా సురేఖపై రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేశాను. ఇలాంటి చౌకబారు ఆరోపణలకు అడ్డూ అదుపు ఉండడం లేదు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నుంచి అలాంటి ఆరోపణలు చేయకుండా లక్ష్మణ రేఖ గీయాలి. వ్యక్తిగత వివాదాల కంటే ప్రజా సమస్యలకే అధిక ప్రాధాన్యం ఇస్తాను. చౌకబారు విమర్శలు చేసేవారికి ఈ పిటిషన్ ఒక గుణపాఠం అవుతుందని ఆశిస్తున్నాను. కోర్టులో నిజం గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని కేటీఆర్ అన్నారు.
I’ve taken a firm stand against baseless allegations and cowardly personal attacks on my character. I have filed a ₹ 100 crore defamation suit against Minister Konda Surekha garu for her malicious and cheap comments
For far too long, these attacks & attempts to indulge in…
— KTR (@KTRBRS) October 22, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం.. ఇదిగో సాక్ష్యం : కేటీఆర్
KTR | అందిన కాడికి దోచుకో.. బామ్మర్ది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Ramannapeta | డ్రైపోర్ట్ ముసుగులో దగా.. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సిద్ధమైన అదానీ గ్రూప్