KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది.. కానీ కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర ఆదాయం తగ్గుదలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో పరుగులు పెట్టిన తెలంగాణకు.. నీ అసమర్థ, అవినీతి పాలనే శాపంగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. తప్పులపై తప్పులు చేసి.. తీరా తగ్గిన ఆదాయంపై అధ్యయనం చేయాలని ఆదేశించడం.. ఇందుకోసం ఏకంగా ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించడం మీ అజ్ఞానానికి మరో సజీవ సాక్ష్యం అని విమర్శించారు.
మీ అనాలోచిత విధానాలతో ఆర్థిక వృద్ధికి బ్రేకులు వేసి.. పాతాళానికి పడిపోయేలా చేసిన పాపం ముమ్మాటికీ మీదే.. పది నెలల పాలనలో అన్ని రంగాలను ఆగం చేసింది మీరే అని కేటీఆర్ మండిపడ్డారు. మీ కూల్చివేతల మనస్తత్వంతో రియల్ ఎస్టేట్ కుదేలైంది. మీ నిష్క్రియాపరత్వంతో ప్రభుత్వ వ్యవస్థలన్నీ దిగాలు పడ్డాయి. మీ అవినీతి, అక్రమార్జనకు పెట్టుబడిదారులు బెంబేలెత్తుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
అందిన కాడికి దోచుకో.. బావమరిది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. అనే మీ దోపిడీ విధానాలతోనే ఆర్థిక వృద్ధి బీటలు వారిందని కేటీఆర్ ఆగ్రహం వెలిబుచ్చారు. రాష్ట్ర రాబడి కన్నా.. మీ సొంత రాబడికే పెద్దపీట వేసే మీ దగాకోరు పాలసీలు, కుంభకోణాలకు తెరదించకుండా.. అధ్వాన్నంగా మారిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై.. మీరు వెయ్యి అధ్యయనాలు చేసినా.. రాష్ట్రానికి నో యూజ్..! అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆదాయం తగ్గుతోంది, కాంగ్రెస్ నాయకుల ఆదాయం అమాంతం పెరుగుతోంది !!
పదేళ్లపాటు బుల్లెట్ వేగంతో..
పరుగులు పెట్టిన తెలంగాణకు అసమర్థ, అవినీతి పాలనే శాపంతప్పులపై తప్పులు చేసి..
తీరా తగ్గిన ఆదాయంపై అధ్యయనం చేయాలని ఆదేశించడం..
ఇందుకోసం ఏకంగా ఇతర రాష్ట్రాలకు బృందాలను పంపించడం..… pic.twitter.com/aU2V1L8jlo— KTR (@KTRBRS) October 22, 2024
ఇవి కూడా చదవండి..
Stethoscope | స్టెతస్కోప్‌తో మాటలు! మూగవారి కోసం సరికొత్త సాంకేతికత
Ramannapeta | డ్రైపోర్ట్ ముసుగులో దగా.. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి సిద్ధమైన అదానీ గ్రూప్
Congress MLA | చంద్రబాబు ఒక కన్ను (తెలంగాణ)ను తీసేశారా? తిరుమలలో జడ్చర్ల ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు