యాదాద్రి భువనగిరి : ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని రాయగిరి ట్రిపుల్ ఆర్ రైతులు(RRR farmers) ఆందోళనలు ఉధృతం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లో(Hyderabad) మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని(Minister Komatireddy) అడ్డుకున్నారు. మంగళవారం ఉదయమే పెద్ద ఎత్తున మంత్రి ఇంటికి చేరుకున్న రైతులు గేట్ బయట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి బయటకు రాగానే ఒక్కసారిగా చుట్టిముట్టిన రైతులు ప్రశ్నల వర్షం కురిపించారు. బయటకు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు.
నాడు అలైన్మెంట్ మారుస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ విషయంలో రాష్ట్ర సర్కారు వివక్షను ప్రదర్శిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రిపుల్ ఆర్లో భాగంగా ఉత్తర భాగానికి ఒక విధంగా, దక్షిణ భాగానికి మరోలా వ్యవహరిస్తున్నది. దక్షిణ భాగంలో అడ్డగోలుగా మార్పులు చేస్తున్న ప్రభుత్వం రాయగిరి అలైన్మెంట్ మార్చాలని రైతులు పెద్దఎత్తున నినదించారు.
ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను(Rayagiri) 40 కిలోమీటర్ల అవతల నుంచి తీసుకుపోవాలి. భూమికి బదులుగా భూమి ఇవ్వాలి, లేనియెడల బహిరంగ మార్కెట్ వాల్యూ ప్రకారంగా నష్టపరిహారంతో పాటు ఉపాధి కల్పించాలని కోరారు. అనంతరం మంత్రికి వినతి పత్రం అందించారు. అయితే నా చేతిలో ఏమీ లేదు.. అంతా సీఎం రేవంత్ రెడ్డి చూస్తున్నారని మంత్రి దాటవేశారు.