బుధవారం 05 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 13:20:50

టీఆర్ఎస్‌లో చేరిన‌ ఇతర పార్టీ కౌన్సిలర్లు

టీఆర్ఎస్‌లో చేరిన‌ ఇతర పార్టీ కౌన్సిలర్లు

మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతున్నాయి. ఇత‌ర పార్టీల‌కు చెందిన ప‌లువురు కౌన్సిల‌ర్లు నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్ గిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీకి చెందిన ఇతర పార్టీ కౌన్సిలర్లు మంత్రి మంత్రి మ‌ల్లారెడ్డి స‌మ‌క్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కౌన్సిల‌ర్లు పాండు, హరిబాబు, ఉమా ఆంజనేయులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి వీరికి కండువా కప్పి పార్టీలోకి సాధ‌రంగా ఆహ్వానించారు.  

మేడ్చల్ నియోజకవర్గం శామీర్ పేట్ మండలం చంద్రపురి కాలనీకి చెందిన కిషోర్ కు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరు అయిన చెక్కును మంత్రి ఈరోజు క్యాంపు కార్యాలయంలో అందజేశారు. 
logo