Vinayakudu | శాయంపేట : హనుమకొండ జిల్లా శాయంపేట మండలం సూరంపేట గ్రామం ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తున్నది. ఆ ఊళ్లో 32 ఏండ్లుగా ఒకే వినాయకుడిని పూజిస్తుండడమే ఇందుకు నిదర్శనం. వినాయక నవరాత్రుల్లో చిన్న గ్రామమైనా నాలుగైదు వినాయకులను పెట్టి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.
కానీ, సూరంపేటలో మూడు దశాబ్దాలుగా ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ప్రత్యేకతను చాటుతున్నారు. సూరంపేటలో 600 మంది జనాభా ఉన్నారు. 500కు పైగా ఓటర్లున్నారు. ఎనిమిది వార్డులున్నాయి. వ్యవసాయంపై ఆధారపడిన రైతులే ఎక్కువగా ఉన్నారు. ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు ఊరి బయట ఉన్న హనుమాన్ దేవాలయంలో నిర్వహిస్తారు. ఒకే వినాయకుడిని ప్రతిష్ఠి గ్రామ ప్రజలంతా ఇక్కడికి ఇచ్చి పూజలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రతి ఏటా ఒక దాత ముందుకొచ్చి గణేశుడిని ఏర్పాటు చేస్తారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు అడుప ప్రభాకర్ చెప్పారు. మరికొందరు ముందుకొచ్చి అన్నదానం కార్యక్రమాలు చేస్తారన్నారు. 32 ఏండ్లుగా గ్రామస్తులమంతా ఐక్యంగా నవరాత్రుల్లో ఆదిదేవుడిని పూజిస్తున్నట్లు చెప్పారు.
ఇవి కూడా చదవండి..
Constable Kistaiah | ఆంధ్రా ఆఫీసర్ అహంకారానికి బలవుతున్న అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి
Sisters Kidnapped | ఆస్తి వివాదం నేపథ్యంలో ఇద్దరు సిస్టర్స్ కిడ్నాప్.. గంటలో రక్షించిన పోలీసులు