Constable Kistaiah | హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఆంధ్రా అధికారుల పెత్తనం మొదలైంది. తెలంగాణ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఓ ఆంధ్రా ఆఫీసర్ అహంకారానికి అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి పద్మావతి బలవుతున్నారు. అర్హత ఉన్నప్పటికీ తనకు ఇవ్వాల్సిన పోస్టు ఇవ్వకుండా.. ఆమెను వేధింపులకు గురి చేస్తున్నారు. తెలంగాణ రాకుండా అడ్డుకోలేకపోయాము కానీ తెలంగాణా ఏర్పాటుకు ముఖ్య కారణమైన కిష్టయ్య యొక్క భార్యకు లైబ్రరీయన్ పోస్ట్ రాకుండా అయినా అడ్డుపడతామని ఆ ఆంధ్రా అధికారిణి సవాల్ చేసినట్లు సమాచారం.
కానిస్టేబుల్ కిష్టయ్య బలిదానం తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన విషయం అందరికి తెలిసిందే. కిష్టయ్య బలిదానం తర్వాత అప్పటి ప్రభుత్వం పద్మావతికి ఇంటర్ విద్యా శాఖలో ఉద్యోగం కల్పించింది. ఆ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తిస్తూనే లైబ్రరీయన్గా ఎదగాలనే సంకల్పంతో కష్టపడి చదివి దానికి సంబంధించిన అర్హతను సాధించించారు ఆమె. ఆ తరువాత జూనియర్ కళాశాలలో లైబ్రరీయన్గా సేవలు అందించాలని అందరితో పాటే దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఇంటర్మీడియట్ మల్టీజోన్-1లో 60 ఖాళీలు ఉండగా, దురదృష్టవశాత్తు ఆమె నంబర్ 61. అయినప్పటికీ ఆమె పేరును డిపార్ట్మెంట్ కమిటీ అప్రూవ్ చేసి.. ఈ 60 మందిలో ఏ ఒక్కరు చేరకపోయినా పద్మావతికి ప్రమోషన్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 60 మంది ఓ ముగ్గురు తమ వ్యక్తిగత కారణాల చేత ప్రమోషన్ వద్దని రాతపూర్వకంగా డిపార్ట్మెంట్ కమిటీకి లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో డిపార్ట్మెంట్ కమిటీ సూచన మేరకు తనకు ప్రమోషన్ ఇవ్వాలని పద్మావతి ఉన్నతాధికారులను కోరారు. అయినప్పటికీ ఆమెను ప్రమోషన్ రాలేదు. ఇంటర్ విద్యా శాఖలోని ముఖ్యమైన ఇద్దరు అధికారులకు, కమిషనర్ శృతి ఓజాకు అనేకసార్లు మొర పెట్టుకున్నది. అయినా ఫైల్ కదల్లేదు. ఆ మొత్తం వ్యవహారాన్ని ఓ ఆంధ్రా అధికారణిని తన గుప్పిట్లో ఉంచుకున్నట్లు సమాచారం.
కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణిని 100 సార్లు ఆఫీస్ చుట్టూ తిప్పించుకొని.. ప్యానల్ ఇయర్ పూర్తయ్యింది కాబట్టి నీకు ప్రమోషన్ ఇచ్చేదే లేదు.. నీ దిక్కున్న చోట చెప్పుకో అని ఇంటర్మీడియట్ కార్యాలయం నుంచి పద్మావతిని గెంటేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి తన బాధను, గోడును, అవమానాలను, అన్యాయాలను విన్నవించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు పద్మావతి.
ఇవి కూడా చదవండి..
KTR | వైద్య విద్యార్థుల జీవితాలతో ఏమిటీ చెలగాటం.. ‘స్థానికత’ జీవోపై కేటీఆర్ మండిపాటు
KTR | పాడి కౌశిక్ రెడ్డిపై దాడి సమయంలో విధుల్లో ఉన్న పోలీసులను సస్పెండ్ చేయాలి.. కేటీఆర్ డిమాండ్
KTR | దుష్ట సంప్రదాయాలకు తెరలేపుతున్న రేవంత్ రెడ్డి: కేటీఆర్