Uganda Marathan Runner: మాజీ ప్రియుడి ఉన్మాదానికి బలైన ఒలింపిక్ రన్నర్, ఉగాండా మారథాన్ రన్నర్ రెబెక్కా చెప్టెగీ (Rebecca Cheptegi) అంత్యక్రియలు ముగిశాయి. ఉగాండా ప్రభుత్వం సైనిక లాంఛనాలతో శనివారం రెబెక్కా అంతిమ సంస్కారాన్ని నిర్వహించింది. సైనికులు గన్ సెల్యూట్(Gun Salute) చేసి.. ఆమెకు నివాళులు ఆర్పించారు. వేలాది మంది ప్రజలు ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికారు. మారథన్‌లో ఉగాండాకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిన రెబెక్కాకు ఆదేశ సైన్యంలో సెర్జెంట్ హోదా దక్కింది. అందుకనే ఆమెకు సైనికుల మాదిరిగానే అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
‘ఆర్మీలో రెబెక్కా మంచి ర్యాంక్‌లో ఉంది. అందువల్ల ఆమె గన్ సెల్యూట్‌కు అర్హురాలు’ అని ఆర్మీ ప్రతినిధి బ్రిగ్ ఫెలిక్స్ కులయిగి ఓ ప్రకటనలో తెలిపాడు. మారథాన్‌లో ఎంతో భవిష్యత్తు ఉన్న రెబెక్కా అకాల మరణం అందరినీ కలిచివేసింది. కెన్యాలో భర్త లేదా ప్రియుడి చేతిలో హత్యకు గురైన మూడో అథ్లెట్ రెబెక్కా.
Domestic violence has no place in society and for top female athletes, it is becoming increasingly fatal especially with jealous partners.
Rebecca Cheptegei (Uganda 🇺🇬) now joins two Kenyans Agnes Tirop (2021) and Damaris Mutua (2022) who were killed by partners in Iten, Kenya. pic.twitter.com/rs10Ac2tND
— Usher Komugisha (@UsherKomugisha) September 5, 2024
ఆమెకంటే ముందు అగ్నెస్ టిరొప్(2021), డమరిస్ ముతువా(2022)లు తమ భాగస్వాముల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కెన్యాలో మహిళా అథ్లెట్లకు రక్షణ కల్పించాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
The funeral of Ugandan Olympic athlete Rebecca Cheptegei, who was killed by her ex-boyfriend, is being held in Uganda.
She will be accorded full military honours, as she served in the Ugandan armed forces.https://t.co/PyOaRDTlgb pic.twitter.com/H2IC4IaJ5f
— BBC News Africa (@BBCAfrica) September 14, 2024
పారిస్ ఒలింపిక్స్ మారథాన్ పరుగులో పాల్గొన్న రన్నర్ రెబెక్కా మృత్యువుతో పోరాడి కన్నుమూసింది. ఉగాండాకు చెందిన ఆమెపై మాజీ ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు. దాంతో రెబెక్కా తీవ్ర గాయాల పాలైంది. కాలిన గాయాలతో దవాఖానలో చేరిన ఆమెను బతికించేందుకు కెన్యా వైద్యులు ఎంతగానో ప్రయత్నిచారు. కానీ, ఫలితం లేకపోయింది. రెండు రోజులు మృత్యువుతో పోరాడిన రెబెక్కా సెప్టెంబర్ 5, గురువారం ఉదయం 5:30 గంటలకు తనువు చాలించింది. 75 శాతం కాలిన గాయాలు కావడంతో ఆమె కోలుకోలేకపోయిందని వైద్యులు చెప్పారు.
Very sad news.
Olympic athlete Rebecca Cheptegei has died days after being doused in petrol and set on fire by a former boyfriend, a Ugandan official says. pic.twitter.com/4J3gMekJTU
— BBC Sport (@BBCSport) September 5, 2024
కెన్యాకు చెందిన డిక్సన్ డియెమ మరగచ్‌తో 33 ఏండ్ల రెబెక్కా కొన్ని రోజులుగా సహజీవనం చేసింది.. అయితే.. తరచూ అతడు ఆమెను వేధింపులకు గురి చేసేవాడు. దాంతో, ఆమె పిల్లలతో కలిసి అతడికి దూరంగా ఉంటోంది. సెప్టెంబర్ 1, ఆదివారం మధ్యాహ్నం 2: 00 గంటలకు ఆమె ఇంటికి వచ్చిన డిక్సన్ ఈ దారుణానికి పాల్పాడ్డాడు. ఉన్మాదిలా మారిన అతడు చర్చి నుంచి తిరిగొస్తున్న ఆమెపై దాడి చేశాడు. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ సమయంలో అతడికి కూడా పటుల చోట్ల కాలిన గాయాలయ్యాయి. రెబెక్కా మరణించిన రెండు రోజులకే డిక్సన్ కూడా గాయాల కారణంగా మృతి చెందాడు.