Asian Champions Trophy | జపాన్‌కు షాకిచ్చిన చైనా.. సెమీస్‌లో భారత ప్రత్యర్థి ఎవరంటే..?
Asian Champions Trophy : ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాకిస్థాన్(Pakistan)ను చిత్తుగా ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు(India Hockey Team) అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. ఆతిథ్య చైనా(China) 2-0తో జపాన్‌పై విజయం సాధించి సెమీస్ బెర్తు దక్కించుకుంది.
Asian Champions Trophy : ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాకిస్థాన్(Pakistan)ను చిత్తుగా ఓడించిన భారత పురుషుల హాకీ జట్టు(India Hockey Team) అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య చైనా(China) 2-0తో జపాన్‌పై విజయం సాధించింది. దాంతో, మూడో స్థానంతో సెమీస్ బెర్తు దక్కించుకుంది.
ఓటమితో జపాన్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాదు పోతూ పోతూ మలేషియాను కూడా తన వెంట తీసుకెళ్లింది. అందువల్ల మెగా టోర్నీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న భారత్, నాలుగో స్థానంలోని కొరియాల మధ్య సెప్టెంబర్ 16వ తేదీన తొలి సెమీస్ జరుగనుంది. అదే రోజు రెండో సెమీఫైనల్లో పాకిస్థాన్, చైనాలు తలపడనున్నాయి. ఐదు, ఆరో స్థానం కోసం జపాన్, మలేషియాలు పోటీపడనున్నాయి.
Captain Harmanpreet Singh leads Team India to yet another famous victory against Pakistan. 🥳💪🏻
2️⃣ penalty corners scored in the first half were enough to win this game after Pakistan took the lead in the game in Q1.
Next up Semi Final on Monday. More details to follow.… pic.twitter.com/NWpH5si6aT
— Hockey India (@TheHockeyIndia) September 14, 2024
డిఫెండింగ్ చాంపియన్‌గా మెగా టోర్నీలో అడుగుపెట్టిన భారత్ అజేయంగా దూసుకెళ్తోంది. తొలి పోరులో చైనాపై 3-0తో గెలుపొందిన టీమిండియా ఆ తర్వాత కూడా అదే జోరు చూపించింది. అనంతరం జపాన్ను హడలెత్తించిన హర్మన్‌ప్రీత్ సింగ్ బృందం 5-1తో విజయబావుటా ఎగరేసింది.
ఇక, శనివారం జరిగిన పోరులో దాయాది పాకిస్థాన్ పని కూడా పట్టింది. 2-1తో జయభేరి మోగించి సెమీస్‌లో అడుగుపెట్టింది. వరుసగా రెండోసారి కప్ కొట్టాలనే కసితో ఉన్న ‘మెన్ ఇన్ బ్లూ’కు చెక్ పెట్టాలని కొరియా భావిస్తోంది. దాంతో, ఇరుజట్ల మధ్య సెప్టెంబర్ 16, సోమవారం తగ్గ పోరు అభిమానులను అలరించడం ఖాయం.
ఇవి కూడా చదవండి
- CV Anand | మధ్యాహ్నం 1.30 లోపే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి చేస్తాం : సీపీ సీవీ ఆనంద్
- Palla Srinivas | విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ, మూసివేత పరిస్థితి వస్తే రాజీనామాలకు సిద్ధం : పల్లా శ్రీనివాస్
- Building collapsed | కుప్పకూలిన భవనం.. శిథిలాల కింద ఇరుక్కున్న 10 మంది..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

