CV Anand | హైదరాబాద్ : వినాయక చవితి నవరాత్రులు మరో మూడు రోజుల్లో ముగియనున్నాయి. ఈ నెల 17వ తేదీన గణేశ్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 30 వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనాన్ని ఈనెల 17 మధ్యాహ్నం 1.30 గంటలోపు పూర్తి చేయనున్నట్లు సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఉదయం 6.30 గంటల వరకు పూజలు ముగించుకుని, నిమజ్జనానికి తరలివెళ్లనున్నట్లు తెలిపారు. పోలీసులు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో కలిసి పనిచేస్తూ ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనాన్ని సకాలంలో పూర్తయ్యేలా చూస్తామన్నారు.
ఇవి కూడా చదవండి..
Ganesh Immersion | గణేశ్ నిమజ్జనం.. 3 రోజుల పాటు సూరారం కట్టమైసమ్మ రోడ్డు బంద్
NIMS | నిమ్స్‌కు యూకే బృందం.. 22 నుంచి చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు
KTR | పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తే.. కేసీఆర్‌కు పేరొస్తుందని రేవంత్ రెడ్డికి భయం : కేటీఆర్