Ganesh Immersion | హైదరాబాద్ : ఈ నెల 17వ తేదీన గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో మూడు రోజుల పాటు సూరారం కట్టమైసమ్మ రోడ్డును మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు ఈ రోడ్డు మూసి ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. బహదూర్‌పల్లి, సూరారం జంక్షన్ వద్ద వాహనాలను మళ్లించనున్నారు. గండి మైసమ్మ నుంచి వచ్చే వాహనాలను బహదూర్‌పల్లి వద్ద మళ్లింపు చేపట్టనున్నారు. బాలానగర్ నుంచి వచ్చే వాహనాలు సూరారం జంక్షన్ వద్ద మళ్లించనున్నారు.
ప్రగతీ నగర్, గండి మైసమ్మ ప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలను, నిజాంపేట్ రోడ్డు నుంచి ప్రగతి నగర్ వైపు వెళ్లే వాహనాలను దారి మళ్లించనున్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పోలీసులు కోరారు. ఈ మార్గాల్లో వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
KTR | పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తే.. కేసీఆర్‌కు పేరొస్తుందని రేవంత్ రెడ్డికి భయం : కేటీఆర్
KTR | పేద ప్రజల కడుపు కొట్టడానికి సీఎం అయ్యావా..? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Constable Kistaiah | ఆంధ్రా ఆఫీసర్ అహంకారానికి బలవుతున్న అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి