అమరావతి: ఏపీలోని విశాఖ స్టీల్‌ప్లాంట్(Visaka Steel Plant) ప్రైవేటీకరణ, మూసివేత పరిస్థితి వస్తే రాజీనామాలకు సిద్ధమని ఏపీ టీడీపీ (AP TDP) అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) ప్రకటించారు. విశాఖ కర్మాగారం వద్ద ఆందోళన నిర్వహిస్తున్న కార్మికుల శిభిరాన్ని ఎంపీ భరత్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులనుద్ధేశించి ఎమ్మెల్యే మాట్లాడారు.
స్టీల్‌ప్లాంట్ కార్మికులు, అధికారులు ఆందోళన చెందవద్దని కోరారు. స్టీల్‌ప్లాంట్ నష్టాలకు యాజమాన్యం చర్యలే కారణమని కార్మిక సంఘాల నేతలు వివరించారు. ప్లాంట్‌లో 3 వేల మంది ఒప్పంద కార్మికులను తొలగించేందుకు యాజమాన్యం యత్నిస్తుందని ఫిర్యాదు చేశారు.
రెండు వేల మందిని వీఆర్ఎస్ తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని కార్మిక సంఘం నాయకుడు అయోధ్యరామ్ పేర్కొన్నారు. మరో 500 మందిని ఇతర పరిశ్రమలకు పంపేందుకు చర్యలు చేపట్టిందని వాపోయారు. ఒప్పంద కార్మికులకు 4 నెలలుగా జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.