Patnam Narender Reddy | మద్దూరు (కోస్గి) : కొడంగల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే ఫార్మా కంపెనీని అడ్డుకొని తీరుతామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం నారాయణపేట జిల్లా కోస్గిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడు గ్రామాల పరిధిలో వేల ఎకరాల్లో ఫార్మాసిటీని నిర్మిస్తున్నారని తెలిపారు. సీఎం రేవంత్‌ను సూటి ప్రశ్న అడుగుతున్నా.. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గంలో 13 వేల ఎకరాలను కేటాయించిందని గుర్తు చేశారు. సిద్ధంగా ఉన్న స్థలంలో ఫార్మా ఏర్పాటు చేయకుండా కొడంగల్‌కు ఎందుకిచ్చారో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికే స్థానిక రైతులు ఈ కంపెనీ రాకను వ్యతిరేకిస్తున్నారని, ఇప్పటికైనా ఫార్మా కంపెనీ ఏర్పాటును విరమించుకోవాలన్నారు.
కోస్గి పట్టణం సమీపంలో పొల్యూషన్ కంపెనీలు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై రౌడీలు దాడి చేయడాన్ని అందరూ ఖండించాలన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్ బీఫాంపై గెలవాలన్నారు. కొడంగల్‌లో 30 శాతం మాత్రమే రుణమాఫీ జరిగిందని, పూర్తిస్థాయిలో అర్హులైన రైతులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | పాలమూరు ఎత్తిపోతల పూర్తి చేస్తే.. కేసీఆర్‌కు పేరొస్తుందని రేవంత్ రెడ్డికి భయం : కేటీఆర్
KTR | పేద ప్రజల కడుపు కొట్టడానికి సీఎం అయ్యావా..? రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Constable Kistaiah | ఆంధ్రా ఆఫీసర్ అహంకారానికి బలవుతున్న అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య సతీమణి