మెదక్ : మెదక్ జిల్లాలో(Medak ) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇనుప మెట్లను బైక్ ఢీకొట్టడంతో (Bike accident) ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పెద్ద శంకరంపేట్ మండలం మల్కాపూర్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఇనుప మెట్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా,
మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు క్షతగాత్రుడిని హాస్పిటల్‌కు తరలించి పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడు రేగోడ్ మండలం పెద్దతండాకు చెందిన మెగావత్ర మేష్(46)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.