కానిస్టేబుల్ జాబ్స్ వయోపరిమితి పెంచండి
కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి 36 ఏండ్లకు పెంచాలని, 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
- బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి డిమాండ్
- డీజీపీకి వినతిపత్రం అందజేసిన నిరుద్యోగ జేఏసీ నాయకులు
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కానిస్టేబుల్ ఉద్యోగాల వయోపరిమితి 36 ఏండ్లకు పెంచాలని, 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ నేత రాకేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. పోలీస్ నిరుద్యోగ జేఏసీతో కలి సి ఆయన మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్‌కు వినతిపత్రం ఇచ్చారు. పోలీస్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడుతున్న అవస్థలను డీజీపీకి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5వేల పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చి చేతులు దులుపుకోవాలని చూస్తున్నదని, అటువంటి ప్రయత్నాలు చేస్తే నిరుద్యోగులు తీవ్ర నిరుత్సాహం తప్పదని వివరించారు. నిరుద్యోగుల అంశాలను పరిగణనలోకి తీసుకొంటామని డీజీపీ హామీ ఇచ్చినట్టు చెప్పారు. అనంతరం పోలీస్ నిరుద్యోగ జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. కేవలం 5 వేల పోస్టులతోనే నోటిఫికేషన్ ఇస్తే వారికి అన్యాయం చేసినట్టేనని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
Hanuma Reddy | రిలీజ్ ముందే బంపరాఫర్.. యష్‌తో డేవిడ్ రెడ్డి దర్శకుడు కొత్త సినిమా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

