నాగర్కర్నూల్ : గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్లబెల్లం( Black jaggery) అక్రమ రవాణా చేస్తుండగా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాలోని బిజినపల్లి మండలం తెలకపల్లి తండాకు భారీగా నల్ల బెల్లం తరలిస్తున్నారనే సమాచారంతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు(Enforcement officers) దాడులు నిర్వహించారు.
పెద్ద మొత్తంలో నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. నిషేధిత నల్ల బెల్లం అమ్మినా కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.