జోగులాంబ గద్వాల : రైతులు తెచ్చిన పల్లీలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని (Jogulamba Gadwal0వ్యవసాయ మార్కెట్ని ఆయన శనివారం సందర్శించారు. మార్కెట్లో రైతులకు దక్కుతున్న మద్దతు ధర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ. రైతులకు మద్దతు ధర కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయలేదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో రైతులు రోడ్లు మీదకు వచ్చి ఆందోళనలు చేయాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరన్నారు. రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని, బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిం చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు హనుమంతు నాయుడు, కురువ పల్లయ్య, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..