హైదరాబాద్ : దాళారులకు మేలు చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం(Congress government) ఉద్దేశపూర్వకంగా పత్తి(Cotton) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి(Niranjan Reddy) విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..సీసీఐ(CCI) కేంద్రాలను ప్రభుత్వం ఇంకా ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు పత్తిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోలేరు.
కొనుగోలు కేంద్రాలకు ఆలస్యంగా తీసుకొస్తే రైతులు నష్టపోతారు. పత్తి రైతులు నిల్వ ఉంచలేరని తెలిసే ప్రభుత్వం కుట్రపూరితంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలేదని మండిపడ్డారు. ప్రభుత్వ మోసపూరిత వైఖరితో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు తక్కువ ధరకే పత్తి అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకుంటే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | ‘హైడ్రా’ వల్ల హైదరాబాద్‌లో భయానక వాతావరణం.. కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్
KTR | కాంగ్రెస్ పరిపాలన.. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు ఉంది.. కేటీఆర్ తీవ్ర విమర్శలు