సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 17:20:37

మంత్రాలయంలో నర్సింహా రెడ్డి పూజలు

మంత్రాలయంలో నర్సింహా రెడ్డి పూజలు

మంత్రాలయం : తుంగభద్ర పుష్కరాల సందర్భంగా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ చైర్మన్ ఎల్. నర్సింహా రెడ్డి మంత్రాలయం వచ్చారు. తుంగభద్రలో పుష్కర స్నానం అనంతరం గ్రామ దేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. రాఘవేంద్ర స్వామి మూల బృందావనం వద్దకు చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం శ్రీ మఠం పీఠాధిపతులు సుబుదీంద్ర తీర్థులు శేష వస్త్రం, ఫల మంత్రాక్షతలు ఇచ్చి నర్సింహారెడ్డిని ఆశీర్వదించారు. మంత్రాలయం తహసీల్దార్‌ చంద్రశేఖర్, సీఐ కృష్ణయ్య, ఎస్‌ఐ వేణుగోపాల్ రాజు, ప్రముఖ న్యాయవాది పురుషోత్తం రెడ్డి, బీజేపీ నేత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.