Kaleshwaram | పెద్దపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్ -2లో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పరిధిలోని నంది మేడారం పంప్‌హౌస్‌లో అధికారులు మోటార్లు ఆన్ చేశారు. నంది మేడారంలో 4, 6వ మోటార్లను ఆన్ చేసినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు మరో 3 పంపులు ఆన్ చేసే అవకాశం ఉంది. గాయత్రి పంప్ హౌస్‌కు 6,240 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నారు. గాయత్రి పంప్‌హౌస్ నుంచి మిడ్ మానేరుకు జలాలు తరలిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అని కేటీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. కాలంతో పోటీ పడుతూ దేశ చరిత్రలోనే ఏ ప్రభుత్వం చేయనంత వేగంగా కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మించిందని గుర్తుచేశారు. తెలంగాణలో మళ్లీ కరువు అనే మాట వినపడకూదనే కేసీఆర్ ముందుచూపు, అఖండమైన సంకల్పబలం, దైవబలంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించుకున్నామని చెప్పారు. కాళేశ్వరం కామధేనువు, కల్పతరువు లాంటి ప్రాజెక్టు అని కొనియాడారు. వంద విభాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక చిన్న సంఘటన పట్టుకుని మేడిగడ్డలో జరిగిన దానిని భూతద్దంలో చూపించి మొత్తం ప్రాజెక్టును బద్నాం చేసి, రాజకీయంగా ప్రయోజనం పొందాలని చూశారని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయని, అనవసరంగా రాజకీయ రచ్చ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రైతుల కోసం కలిసికట్టుగా పనిచేద్దామని కోరారు. అన్నారం, సుందిళ్లలో గ్రౌటింగ్ చేశారా? అని అధికారులును అడిగితే… రెగ్యులర్‌గా జరిగేవేనని, ఎలాంటి ఇబ్బందులు లేవని తమతో చెప్పారని కేటీఆర్ వివరించారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అధ్యక్షా ఆయనకు హాఫ్ నాలెడ్జ్.. మంత్రి కోమటిరెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Harish Rao | బీఆర్ఎస్ పదేండ్ల శ్రమను.. కాంగ్రెస్ 8 నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారు: హరీశ్ రావు
Jagadish Reddy | వ్యవసాయంపై ఒక్క మంత్రికీ అవగాహన లేదు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
Bhadrachalam | భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం