Jagadish Reddy | వ్యవసాయంపై ఒక్క మంత్రికీ అవగాహన లేదు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారన్నారు.
హైదరాబాద్: వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. ఆంధ్రా బాసుల మోచేతి నీళ్లు తాగిన వీళ్లకు తెలంగాణ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. కృష్ణా, గోదావరి నదులు ఆంధ్రా కోసమే పుట్టినట్లు గతంలో పాలకులు వ్యవహరించారన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. నీళ్లు ఎలా లిఫ్ట్ చేయాలో తెలిసే కేసీఆర్ కన్నెపల్లి వద్ద పంప్ హౌస్ నిర్మించారన్నారు. మేడిగడ్డకు ఏదో జరిగిందని ప్రభుత్వం చెబుతున్నది. ఇప్పుడు మేడిగడ్డ వద్ద 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా పోతున్నాయని చెప్పారు.
మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, సింగూరు ప్రాజెక్టులు నీళ్లు లేక ఎండిపోతున్నాయని చెప్పారు. కోదాడ, సూర్యపేట నియోజకవర్గాల్లో రైతులు నీళ్ల కోసం ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ఎన్డీఎస్ఏ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాకులు చెబుతున్నదని విమర్శించారు. ప్రభుత్వానికి నీళ్లు ఇచ్చే ఉద్దేశం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కాళేశ్వరంపై నాటకాలు ఆడుతున్నాయన్నారు. ఎన్డీఎస్ఏ హైదరాబాద్ రాకుండా ఢిల్లీ నుంచే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినట్లు రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

