Bhadrachalam | భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటిమట్టం
Bhadrachalam | భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది.
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం (Bhadrachalam ) వద్ద గోదావరి ప్రవాహం తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నది. ఎగువనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకూ అధికమవుతున్నది. శుక్రవారం రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం, శనివారం తెల్లారే సరికి ఒక్కసారిగా పెరిగింది.
దీంతో భద్రాచలం వద్ద మళ్లీ గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నీటిమట్టం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రభావంతో భద్రాచలంలోని కొత్త కాలనీలోకి భారీగా మురుగు నీరు వచ్చి చేరుతోంది. కొత్త కాలనీలో దాదాపు 30 ఇండ్లను మురుగు నీరు ముంచెత్తింది. కొత్త కాలనీ వాసులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నీరు ఎత్తిపోసే మోటార్లు పాడవడంతో మురుగునీరు పేరుకుపోతోంది. భద్రాచలంలోని ఏఎంసీ కాలనీకి వరద నీరు చేరింది. ఏఎంసీ కాలనీలో 40 ఇండ్లలో మురుగు నీరు చేరింది. 200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు.
వరద నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ, లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా, గోదవారి ఉధృతితో దుమ్ముగూడెం, పర్ణశాల వద్ద గోదావరి నీటిమట్టం 25 అడుగులు దాటింది. దీంతో భద్రాచలం, దుమ్ముగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సున్నంబట్టి రోడ్డుపైకి గోదావరి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇంబ్బందులు ఎదుర్కొంటున్నారు. భద్రాచలంలోని ఏఎంసీ కాలనీ శివారులో ఇండ్లలోకి వరద నీరు చేరింది.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అధ్యక్షా ఆయనకు హాఫ్ నాలెడ్జ్.. మంత్రి కోమటిరెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Harish Rao | బీఆర్ఎస్ పదేండ్ల శ్రమను.. కాంగ్రెస్ 8 నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారు: హరీశ్ రావు
Jagadish Reddy | వ్యవసాయంపై ఒక్క మంత్రికీ అవగాహన లేదు: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cop Rapes Girl | పోలీస్ సహాయం కోరిన బాలిక.. కార్యాలయంలో పోలీస్ అధికారి అత్యాచారం
Harish Rao | రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్..భూములను కాపాడిందే బీఆర్ఎస్ : మాజీ మంత్రి హరీష్‌రావు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
‘కార్మిక హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటాలు కొనసాగించాలి’
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

