Harish Rao | అధ్యక్షా ఆయనకు హాఫ్ నాలెడ్జ్.. మంత్రి కోమటిరెడ్డిపై హరీశ్ రావు ఫైర్
మంత్రి కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనలేదా అని ప్రశ్నించారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
హైదరాబాద్: మంత్రి కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనలేదా అని ప్రశ్నించారు. బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. బస్సులు లేని 15 వందల గ్రామాలకు బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై సాధారణ చర్చను హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రసంగం ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? ప్రశ్నించారు. రూ.4.5 లక్షలు లేని జీఎస్డీపీని రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై సాధారణ చర్చను ఆయన ప్రారంభించారు. గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి కలుగజేసుకుని బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 24 గంటల కరెంట్ ఎక్కడిచ్చారో చెప్పాలన్నారు. దీనికి హరీశ్ రావు మంత్రి కోమటిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు. కోమటిరెడ్డి హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మహాలక్ష్మీ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలన్నారు. తెలంగాణలో 90 శాతం దొడ్డు వడ్లు పండిస్తారని, దొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలన్నారు. గృహజ్యోతి పథకంలో ఇబ్బందులున్నాయని, యువ వికాసం పథకంపై బడ్జెట్లో అసలు చర్చే లేదన్నారు. చేయూత గురించి ప్రభుత్వం మాటైనా మాట్లాడటం లేదని విమర్శించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక హాఫ్ నాలెడ్జ్ ఫెల్లో – హరీష్ రావు pic.twitter.com/3irzMxinV8
— Telugu Scribe (@TeluguScribe) July 27, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

