చిన్నకోడూరు/సిద్దిపేట : జిల్లాలోని చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ గ్రామ శివారులో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను నాబార్డు చైర్మన్లు జీఆర్ చింతల, వెంకటేశ విద్యాసాగర్ చింతల గురువారం సందర్శించారు. ప్రత్యేక హెలికాప్టర్లో చంద్లాపూర్ రంగనాయకసాగర్‌కు చేరుకోగా అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
రంగనాయకసాగర్ పంపుహౌస్, డిస్ట్రిబ్యూషన్ కెనాల్, రిజర్వాయర్ నిర్మాణం గురించి ఈఎన్సీలు మురళీధర్, హరిరామ్, వైకే రావులు క్లుప్తంగా వివరించారు. అనంతరం రిజర్వాయర్ పంపుహౌస్‌లోకి వెళ్లి అక్కడ మోటర్ల పనితీరు విధానాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఒక్కో మోటారు సామర్థ్యం ఎంత ఉంది.. దాని పనితీరు విధానాన్ని ఈఎన్సీలు వివరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆలోచన చాలా గొప్పగా ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి భారీ ప్రాజెక్టులు నిర్మించడం రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఎక్కడా చూసిన రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉందన్నారు. కార్యక్రమంలో కాళేశ్వరం ఎస్ఈ బస్వరాజ్, ఈఈలు గోపాలకృష్ణ, రవీందర్‌రెడ్డి, ఏఈఈ ఖాజా, మెగా కంపెనీ సిబ్బంది ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | ఆ సొమ్మును అల్లుడే కాజేశాడట..
ట్రైనీ నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తించిన సూపరింటెండెంట్‌కు దేహశుద్ధి
Yadadri Temple | యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు