గుజరాత్ తీరంలో గల్లంతైన 15 మత్సకారుల పడవలు
Gujrat | అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 15 మత్స్యకారుల పడవలు గల్లంతయ్యాయి. గురువారం తెల్లవారుజామున గుజరాత్‌లోని (Gujrat) గిర్ సోమ్‌నాథ్

అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 15 మత్స్యకారుల పడవలు గల్లంతయ్యాయి. గురువారం తెల్లవారుజామున గుజరాత్‌లోని (Gujrat) గిర్ సోమ్‌నాథ్ జిల్లా ఉనా హార్బర్ సమీపంలో 15 పడవలు నీటమునిగాయి. దీంతో సముద్రంలో సుమారు 15 మంది గల్లంతై ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరినట్లు తెలిపారు. ప్రతికూల వాతావరణం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. కాగా, ఎన్ని పడవలు గల్లంతయ్యాయనే విషయంలో స్పష్టత లేదన్నారు.

కాగా, పడవల గల్లంతుపై భారత నౌకాదళం అప్రమత్తమయింది. హెలికాప్టర్ సాయంతో గాలింపు చర్యలు చేపట్టింది. అదేవిధంగా పోలీసులు, కోస్ట్ గార్డ్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారని గిర్ సోమ్‌నాథ్ జిల్లా కలెక్టర్ ఆహుల్ త్రిపాఠి వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కేసీఆర్ దీక్షా దివస్ లేకపోతే.. రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడే కాదు : హరీశ్ రావు
Jagdeep Dhankhar | మాజీ ఉప రాష్ట్రపతి ధంఖర్‌కు.. ఏడాదిపైగా కేటాయించని అధికార నివాసం
తెలంగాణ ప్రజల్లో ఉద్యమ జ్వాలాను రగిలించిన రోజే దీక్ష దివస్ : రవీంద్ర కుమార్
CPI | ‘రూ.10 వేల కోట్లతో తెలంగాణ ఉద్యమకారుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి..’
Ramayana | ‘రామాయణ’ ఓటీటీ ప్రేక్షకులకు బిగ్ షాక్.. ఇప్పట్లో డిజిటల్ స్ట్రీమింగ్ లేనట్టేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!

