నిర్మల్ : ఎనిమిది నెలలుగా జీతాలు లేవు. ఇంటి కిరాయిలు, పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. చివరికి పండుగ పూట కూడా పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొందని మున్సిపల్ కార్మికులు(Municipal workers) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు పెండింగ్ వేతనాలు (Pending salaries) వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ కార్మికులు ఒంటి కాలిపై నిలబడి నిరసన తెలిపారు. నెలల తరబడి జీతాలు రాకుంటే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాకాయి పడిన వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | కాంగ్రెస్ గ్యారెంటీలు అబద్దమని హర్యానా ప్రజలు గ్రహించారు : కేటీఆర్
Harish Rao | ఆ వీడియోలో తప్పేముంది..? జర్నలిస్ట్ గౌతమ్‌ను వెంటనే విడుదల చేయాలి : హరీశ్‌రావు