హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : సీపీఐ సీనియర్ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ జాతీయ కార్యదర్శి ఆర్ నల్లకన్ను (101) కన్నుమూశారు. చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ దవాఖానలో తుది శ్వాస విడిచారు.
ఆయన మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను అవనతం చేశారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మృతి పట్ల సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సీనియర్ నాయకులు చాడా వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత నారాయణ, శ్రీనివాస్‌రావు సంతాపం ప్రకటించారు.