Harish Rao | హైదరాబాద్ : తెలుగు స్క్రైబ్ జర్నలిస్ట్ గౌతమ్‌ను అక్రమంగా అరెస్టు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన బాధను వెలిబుచ్చుకున్న రైతు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తే అరెస్టు చేస్తారా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ప్రజల ఆందోళనలు, బాధలను తెలిపితే అక్రమ అరెస్టు చేస్తారా..? గౌతమ్ షేర్ చేసిన వీడియోలో తప్పేముంది..? ఈ వీడియోను తెలంగాణలోని మేధావులు చూడాలి. ఈ వీడియోలో ఎక్కడైనా చట్ట విరుద్ధం, అసభ్యకరం, దుర్వినియోగం కనిపించిందా..? అని డీజీపీని సూటిగా అడిగారు. అక్రమంగా అరెస్టు చేసిన గౌతమ్‌ను వెంటనే విడుదల చేయాలి. తెలంగాణలో జర్నలిస్టులను అన్యాయంగా అరెస్టు చేయడం కలకలం రేపుతోందని హరీశ్‌రావు పేర్కొన్నారు.
Telugu Scribe Journalist Gowtham was illegally arrested today by the Revanth government for sharing a farmer’s video.
What kind of democracy is this, where reporting the concerns and suffering of the people leads to false cases?
I appeal to all intellectuals in Telangana to… https://t.co/yeT6Hgrm8a
— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2024
ఇవి కూడా చదవండి..
Roja | పవన్ స్వామి.. మీరు దీక్ష చేయాల్సింది ప్రసాదాల కోసం కాదు.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
KTR | దండగమారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు..! రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్