MLA Jagadish Reddy | హైదరాబాద్ : మా సోషల్ మీడియా పిల్లలను చూస్తేనే నీవు వణికిపోతున్నావ్.. లాగు తడుస్తుంది. నీకు అప్పుడే కేసీఆర్ కావాలా..? అని సీఎం రేవంత్ రెడ్డిపై సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అన్నదాతల వీడియోలను పోస్టు చేసిన సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు లుక్ అవుట్ నోటీసులు ఇచ్చి బెంగళూరులో అరెస్టు చేస్తున్నావ్. అలాంటి నీకు అప్పుడే కేసీఆర్ కావాలా..? మమ్మల్ని అందర్నీ దాటుకుంటూ నువ్వు కేసీఆర్ దగ్గరకు పోవాలి.. అసలు నువ్వు మమ్మల్ని దాటాలి కదా..? అని రేవంత్‌ను జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తే.. దాన్ని సోషల్ మీడియాలో పెట్టినందుకు యూట్యూబ్ జర్నలిస్టుల మీద కేసులు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి పిచ్చి కలలు కనకు. ఈ ప్రపంచంలో చాలా మంది నియంతలు పోయారు. రజాకార్ల దాడులకు కూడా ఈ తెలంగాణ ప్రజలు, రైతాంగం భయపడలేదు. నీలాంటి వాళ్లకు భయపడుతారా..? సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారిపై కేసులు నమోదు చేస్తే.. ప్రజలు ప్రశ్నించడం మానేస్తారు అనుకుంటే నీకు మించిన మూర్ఖుడు లేడు. లక్షల కోట్ల గొంతుకలు నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాయి. తెలంగాణ ప్రజల ముందు మైకులు పెడితే.. నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుస్తది. ఆ మాటలు విన్నాక నీకు అర్థం కాకపోయినా.. నీ కుటుంబ సభ్యులకు అర్థమైతదని జగదీశ్ రెడ్డి తెలిపారు.
పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పైస్థాయి అధికారులు కూడా చట్టాన్ని ఫాలో కావడం లేదు. జాగ్రత్తగా చట్ట ప్రకారం పని చేయండి. లేదంటే దెబ్బతినే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా పిల్లలకు లుక్ అవుట్ నోటీసులా..? సిగ్గుండాలి కదా..? ఎయిర్‌పోర్టుల్లో అరెస్టు చేస్తారా..? ఎందుకు భయపడుతున్నవ్ రేవంత్ రెడ్డి.. మొదలే కాలేదు.. ముందుంది మొసళ్ల పండుగ.. ఎందుకు వణికిపోతున్నవ్ అప్పుడే రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టులు చేస్తే ఈ ప్రపంచం ప్రశ్నించడం మానేస్తుంది అని అనుకోవడం నీ మూర్ఖత్వం అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
సోషల్ మీడియాలో వీడియోలు పెడితేనే నీకు లాగులు తడిసి గౌతం అనే అబ్బాయిని లుక్ ఔట్ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేయిస్తున్నావ్.. నీకు కేసీఆర్ అవసరమా – మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి pic.twitter.com/3WWGZZiNPU
— Telugu Scribe (@TeluguScribe) October 8, 2024
ఇవి కూడా చదవండి..
KTR | దండగమారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు..! రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్