MLA Jagadish Reddy | హైదరాబాద్ : మూసీ సుందరీకరణకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటో చెప్పాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. మూసీ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రిది ఒక మాట అయితే.. మంత్రివర్గానిది మరో మాట ఉందని విమర్శించారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మూసీని ఏం చేయదలుచుకున్నారో ఇప్పటి వరకు చెప్పలేదు. లక్షా 50 వేల కోట్లు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. నిన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎవడు చెప్పాడు అంటుండు. ఎవడు చెప్పాలో వాడే చెప్పిండు.. రేవంత్ రెడ్డి చెప్పింది కూడా మంత్రులు మీకు తెల్వట్లేదు. చెరువుల విషయంలో భట్టి విక్రమార్క చర్చకు సిద్ధమా..? గూగుల్ మ్యాప్స్ మొదలైనప్పటి నుంచి చెరువుల పరిస్థితి ఏమిటో చూద్దాం. భట్టి విక్రమార్క ప్రకటించిన జాబితా ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా..? కూల్చివేతలతో ఇప్పటికే రూ. వెయ్యి కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం కలిగింది. రూ. వందల కోట్లు కొల్లగొట్టి కడుపులు నింపుకోవాలనేది ఆలోచన. హుస్సేన్ సాగర్, మూసీ పాపాలకు కాంగ్రెస్ కారణం కాదా..? అని జగదీశ్ రెడ్డి కడిగిపారేశారు.
మేము కట్టిన ప్రాజెక్టులతో నీళ్లివ్వడం చేత కావట్లే.. కరెంట్ ఇవ్వడం చేత కావట్లే, మంచి నీళ్లు ఇవ్వడం చేత కావట్లే. కానీ లక్షా 50 వేల కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేస్తాడంట అని జగదీశ్ రెడ్డి విమర్శించారు. మూసీ ప్రక్షాళన కోసం నివాసిత ప్రజలను నిర్వాసితులుగా మార్చడం సరికాదని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో చేపట్టిన అక్రమ కట్టడాలను మేం చూపిస్తాం కూల్చుతారా..? మూసీపై చర్చకు సిద్ధమా..? అని భట్టి విక్రమార్కకు జగదీశ్ రెడ్డి సవాల్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Nobel Prize in Physics : ఈ యేడాది ఫిజిక్స్‌లో ఇద్దరికి నోబెల్ పురస్కారం
KTR | దండగమారి పాలనలో పండుగ పూట కూడా పస్తులు..! రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్