Harish Rao | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయండి.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన హరీశ్‌రావు
Harish Rao | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా, సుమారు 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్యగోచరంగా మార్చింది అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
Harish Rao | హైదరాబాద్ : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా, సుమారు 13 లక్షల మంది విద్యార్థుల జీవితాలను కాంగ్రెస్ ప్రభుత్వం అగమ్యగోచరంగా మార్చింది అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం వల్ల జరుగుతున్న ఇబ్బందులను హరీశ్‌రావుకు తెలంగాణ ప్రయివేటు డిగ్రీ, పీజీ కాలేజేస్ మేనేజ్మెంట్ అసోసియేషన్ సభ్యులు వివరించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం మూలంగా.. టీసీ, ఇతర సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వడం లేదు. దీని వల్ల విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనివల్ల విద్యార్థులతో పాటు, తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు.
విద్యా వ్యవస్థ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి ఇంతకు మించిన ఉదాహరణ లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ. 19 వేల కోట్లను ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విడుదల చేయడం జరిగింది. ప్రతి ఏడాది సగటున క్రమం తప్పకుండా రెండు వేల కోట్లు విడుదల చేసిందని, కరోనా వంటి సంక్షోభ సమయంలోనూ ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికి కేవలం విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లో ఒక్క రూపాయి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్య పట్ల తమకున్న ప్రాధాన్యాన్ని చాటి చెబుతుందని హరీశ్‌రావు తీవ్రంగా విమర్శించారు.
దసరా, దీపావళి వేళ సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేక పోతున్నామని అసోసియేషన్ సభ్యులు వివరించారు. సిబ్బంది నుండి తమపై విపరీతమైన ఒత్తిడి వస్తున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. భవనాల అద్దెలు చెల్లించలేక, తెచ్చిన అప్పులు వడ్డీలు కట్టలేక, కొత్త అప్పులు దొరక్క కళాశాలల నిర్వహణ భారంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ బకాయిలు చెల్లించేలా ప్రభుత్వాన్ని నిలదీస్తాం..ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | నా మీద కూడా కేసులు నమోదు చేస్తారా డీజీపీ గారూ..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్
Musi Riverfront | బాబు చూపిన బాటలో రేవంత్.. అప్పుడు నందనవనం.. ఇప్పుడు రివర్ ఫ్రంట్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | భారత నౌకలకు హర్మూజ్‌లో ప్రత్యేక మినహాయింపు ఇచ్చిన ఇరాన్..!
Panchayat Secretaries | డోన్ట్ కేర్.. హాజరు వేసుకొని ఇంటికెళ్తున్న పంచాయతీ కార్యదర్శులు..!
Double Murder | మీర్పేట్లో జంట హత్యల కలకలం.. పోలీసుల నిర్లక్ష్యమే కారణమా..?
Girl died | కార్డియాక్ అరెస్ట్‌తో స్కూల్లో కుప్పకూలిన తొమ్మిదేళ్ల బాలిక..!
Tirumala | దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో వాటర్,ఫుడ్ అనాలసిస్ ల్యాబ్ అభివృద్ధి : టీటీడీ
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

