Harish Rao | కన్వీనర్ కోటాలో ఆ ర్యాంకులకు ఎంబీబీఎస్ సీట్లు రావడం చరిత్రలో ఇదే తొలిసారి.. ఆ ఘనత కేసీఆర్‌దే: హరీశ్ రావు
వైద్య విద్యకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్‌గా చేసిన ఘనత కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నీట్లో 3 లక్షలకు పైగా ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు రావడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు.
హైదరాబాద్: వైద్య విద్యకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్‌గా చేసిన ఘనత కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. నీట్లో 3 లక్షలకు పైగా ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు రావడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. బీసీ ఏ కేటగిరిలో 3.35 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు, ఎస్టీ కేటగిరీలో 2.89 లక్షల ర్యాంకు, బీసీ బీలో 2.27 లక్షలు, బీసీ సీలో 3.14 లక్షలు, బీసీ డీలో 2.13 లక్షలు, బీసీ ఈలో 2.24 లక్షల ర్యాంకులు సాధించిన వారికి ఎంబీబీఎస్ సీట్లు రావడం చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపారు. కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
మారుమూల ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడం, తెలంగాణ బిడ్డలు డాక్టర్ కావాలనే కలను స్వరాష్ట్రంలోనే ఉండి సుసాధ్యం చేసుకోవాలని జిల్లాకు ఒక మెడికల్ కాలేజిని కేసీఆర్ ఏర్పాటు చేశారన్నారు. గత పదేండ్ల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుంచి 34కు పెరిగాయని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 20 నుంచి 60కి చేరాయన్ని వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2850 నుంచి 8315లకు పెరిగిందని, ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు.
‘‘కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు. మూడు లక్షల పైగా ర్యాంకులు వచ్చిన తెలంగాణ విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు రావడం సంతోషించదగ్గ విషయం. బీసీ-ఏ కేటగిరిలో 3.35 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్టీ కేటగిరీలో 2.89 లక్షల ర్యాంకు, బీసీ-బి లో 2.27 లక్షలు, బీసీ-సీ లో 3.14 లక్షలు, బీసీ-డి లో 2.13 లక్షలు, బీసీ-ఈ లో 2.24 లక్షల గరిష్ట ర్యాంకులు సాధించిన వారికి ఎంబీబీఎస్ సీట్లు రావడం చరిత్రలో ఇదే మొదటిసారి.
మారుమూల ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని చేరువ చేయడం, తెలంగాణ బిడ్డలు డాక్టర్ కావాలనే కలను స్వరాష్ట్రంలోనే వుండి సుసాధ్యం చేసుకోవాలని కేసీఆర్ గారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజి ఏర్పాటు చేశారు. కేసీఆర్ పాలనలో గడిచిన పదేళ్ల కాలంలో రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 5 నుంచి 34కు పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేటు కలిపి మొత్తం మెడికల్ కాలేజీల సంఖ్య 20 నుంచి 60కి చేరాయి.
వైద్య విద్యకు తెలంగాణను కేరాఫ్ అడ్రస్ గా చేసిన ఘనత కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. దీంతో తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2850 నుంచి 8315లకు పెరిగి, ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు అవకాశాలు గణనీయంగా పెరిగాయి. వైద్య విద్య కోసం చైనా, ఉక్రెయిన్, రష్యా, ఫిలిప్పీన్స్ వంటి దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. రాష్ట్రంలో పెరిగిన మెడికల్ సీట్లను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని, తెలంగాణాలో ఉంటూ వైద్య విద్య చదివి దేశానికి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాను.’’ అంటూ హరీశ్ రావు ట్వీట్ చేశారు.
కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు.
మూడు లక్షల పైగా ర్యాంకులు వచ్చిన తెలంగాణా విద్యార్థులకు కూడా కన్వీనర్ కోటాలో ఎంబిబిఎస్ సీట్లు రావడం సంతోషించదగ్గ విషయం.
బీసీ-ఏ కేటగిరిలో 3.35 లక్షల ర్యాంకు వచ్చిన విద్యార్థికి, ఎస్సీ కేటగిరీలో 3.11 లక్షల…
— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Convenor quota
- harish rao
- KCR
- MBBS
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

