Manda Krishna Madiga | హైదరాబాద్ : రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ప్రభుత్వ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మందకృష్ణ ప్రశ్నించారు. వర్గీకరణ చేయకుండానే 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రాల్లో రేపు భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి, ధర్నా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రాల్లోని అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్లేట్ల వరకు ర్యాలీలు చేపట్టాలన్నారు. అనంతరం జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు అందించాలి. హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ నుంచి బషీర్బాగ్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు మందకృష్ణ మాదిగ తెలిపారు.
రేవంత్ సర్కార్ తమకు నమ్మక ద్రోహం చేసిందని మందకృష్ణ ధ్వజమెత్తారు. మాదిగలకు సీట్లు తగ్గడానికి కూడా రేవంత్ రెడ్డినే కారణం అన్నారు. ఎస్సీ వర్గీకరణ లేకుండానే ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు. అసెంబ్లీలో ప్రకటించిన మాదిరిగా.. రేవంత్ రెడ్డి అన్ని ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లలో ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | నా మీద కూడా కేసులు నమోదు చేస్తారా డీజీపీ గారూ..? సూటిగా ప్రశ్నించిన కేటీఆర్