
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అవరోధాలు కొందరికి అడ్డంకిగా మారితే, మరికొందరిని గొప్ప వ్యక్తులుగా తయారు చేస్తాయన్న నెల్సన్ మండేలా సూక్తిని ఆమె ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజల స్వేచ్ఛ కోసం తన జీవితాన్ని త్యాగం చేసే స్థాయికి వెళ్ళిన నిజమైన నాయకుడు కేసీఆర్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు కవిత సెల్యూట్ చేశారు. తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం గత ఇరవై ఏళ్లుగా నిరంతరం శ్రమిస్తూ, అనేక త్యాగాలు చేసిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్సుమాంజలులు అని ట్వీట్లో ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
Saluting to the millions of @trspartyonline family for all the hardship & sacrifice that you endured in the last twenty years for the betterment of people of Telangana.#20YearsOfTRS #TRSFormationDay
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 26, 2021
Jai Telangana !! Jai KCR !!
ఇవికూడా చదవండి..