మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 17, 2020 , 01:44:06

బండి సంజయ్‌కి అవగాహనలేదు

బండి సంజయ్‌కి అవగాహనలేదు
  • ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్రాభివృద్ధికి బీజేపీ నేతలు ఏమాత్రం సహకరించడంలేదని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన బండి సంజయ్‌కు రాష్ట్రంపై ఎలాంటి అవగాహనలేదని చెప్పారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ నిన్నటివరకూ ప్రభుత్వాన్ని తిట్టేందుకే పరిమితమయ్యారని, ఆయన వారసత్వాన్ని సంజయ్‌ పుచ్చుకొన్నారని ఎద్దేవాచేశారు.


logo
>>>>>>