ఉద్యోగం మారినా పీఎఫ్ నంబర్ ఒకటే
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) అకౌంట్‌ను సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా మాదిరిగా ఎప్పుడంటే అప్పుడు ఓపెన్ చేయడం లేదా క్లోజ్ చేయడం ఉండదు. ఉద్యోగం మానేసినప్పుడు లేదా ఉద్యోగి చనిపోయినప్పుడు మాత్రమే ఈపీఎఫ్ అకౌంట్ క్లోజ్ చేయడానికి వీలుంటుంది. ప్రస్తుతం ఐదు కోట్ల మందికి ఈపీఎఫ్ అకౌంట్ ఉంది. ఏటా 8.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఉద్యోగం మారినప్పుడల్లా కొత్త అకౌంట్‌ను ఓపెన్ చేయకుండా పాన్ నంబర్ మాదిరిగానే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్)ను ఈపీఎఫ్ అకౌంట్ ఉన్న వారందరికీ ఇస్తారు. ఇది 12 అంకెల నంబర్. ఉద్యోగాలు మారినప్పుడల్లా ఈ నంబర్‌ను కొత్త యాజమాన్యానికి తెలియచేస్తే పాత అకౌంట్ లోనే పీఎఫ్ మొత్తం జమ అవుతుంది. జీవిత కాలం ఒకే నంబర్ ఉంటుంది. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ యూఏఎన్ ద్వారా సులభంగా బదలాయించడంతోపాటు విత్‌డ్రాయల్స్ కూడా సులభం.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- EPF
- EPFO
- job
- PF number
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!


