MLA Sunitha Laxma Reddy | హైదరాబాద్ : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మన నుంచి దూరం కావడం బాధాకరమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. నందిత మృతిపట్ల శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి సభలో మాట్లాడారు.
తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన లాస్య నందిత మృతి చెందడం బాధాకరం. తన తండ్రి సాయన్న ఆశయాలు నెరవేర్చాలని లాస్య నందిత రాజకీయ రంగ ప్రవేశం చేశారు. లాస్య నందిత ప్రజా సేవ చేయాలనే ఆత్రుతతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ మనం నుంచి దూరమైంది. అతి చిన్న వయసులో శాసనసభలో అడుగుపెట్టిన నందితకు పెద్దలంటే ఎంతో గౌరవం ఉండేది. నిజంగా హడావిడిగా ఉంటూ సందడి చేసేది ఆమె. నందిత మృతిపట్ల సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను అని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | లాస్య నందిత భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం.. భావోద్వేగానికి లోనైన కేటీఆర్
Union Budget | వచ్చే ఐదేళ్లలో 20 లక్షల మందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ : ఆర్థిక మంత్రి
Nirmala Sitharaman | మరోసారి చేనేత చీరలోనే.. బడ్జెట్ వేళ తెలుపురంగు చీరలో నిర్మలమ్మ