Nirmala Sitharaman | మరోసారి చేనేత చీరలోనే.. బడ్జెట్ వేళ తెలుపురంగు చీరలో నిర్మలమ్మ
irmala Sitharaman | కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె చేనేత చీరలో మెరిశారు.
Nirmala Sitharaman | కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరాని (2024-25)కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఇవాళ లోక్‌సభకు సమర్పించారు. ఆమె బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టడం ఇది వరుసగా ఏడోసారి కావడం విశేషం. ఇక పార్లమెంట్లో ఆమె చేసే ప్రసంగాలే కాదు.. సందర్భానుసారంగా ఆమె ధరించే వస్త్రాలు కూడా అందరినీ ఆకర్షిస్తాయి. ప్రతి ఏటా ఈ ప్రత్యేక సందర్భంలో సమావేశాలకు నిరాడంబరంగా హాజరయ్యే కేంద్ర ఆర్థిక మంత్రి ఈ ఏడాది కూడా అదే తీరును అనుసరించారు. ఈ సారి కూడా నిర్మలమ్మ చీరఎంపికలో తన మార్క్‌ను చూపించారు (signature sarees on Budget Day).
ఏటా బడ్జెట్ రోజున ధరించే చీరల విషయంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు నిర్మలమ్మ. ఇక స్వతహాగా చేనేత చీరలను ఇష్టపడే ఆమె.. 2019లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచీ బడ్జెట్ సమావేశాలకు ఆమె చేనేత చీరనే ధరిస్తూ వస్తున్నారు. ఈ సారి కూడా ఆమె ఇదే సంప్రదాయాన్ని అనుసరించారు. ఈసారి ఆమె తెలుపు రంగు (white saree) చీరను ఎంచుకున్నారు. బంగారు మోటిఫ్‌లతో ఉన్న మెజెంటా బార్డర్‌తో కూడిన తెలుపు రంగు చెక్స్ చేనేత చీరలో మెరిశారు. ఇక తెలుపు రంగు స్వచ్ఛతకు సామరస్యానికి భారతీయ సంస్కృతిలో కొత్త శకం ప్రారంభానికి శుభసూచికంగా భావిస్తారన్న విషయం తెలిసిందే.
ఇక 2019లో తొలిసారి బడ్జెట్ ప్రసంగానికి నిర్మలమ్మ.. మంగళగిరి గులాబీ రంగు చీర కట్టుకున్నారు. ఆ సమయంలో బడ్జెట్ పత్రాలు తెచ్చే సూట్ కేస్ స్థానంలో బహీ ఖాతా (ఎర్నటి వస్త్రంతో చుట్టిన సంచీ)తో పార్లమెంట్‌కు చేరుకున్నారు. ఇక 2020లో నీలం రంగు అంచులో పసుపుపచ్చ – బంగారు వర్ణంలో ఉన్న చీరతో సమావేశాలకు హాజరయ్యారు. 2021లో ఎరుపు – గోధుమ రంగు కలగలిసిన భూదాన్ పోచంపల్లి చీరలో మెరిశారు. 2022లో మెరూన్ కలర్ ఒడిశా చేనేత చీరను ధరించారు. రస్ట్ బ్రౌన్, డార్క్ మెరూన్ కలగలిసిన చీరకు ఆఫ్ వైట్ నేత బోర్డర్ మరింత ఆకర్ణణీయత తెచ్చింది. ఆ చీరలో ఆమె నిరాడంబరతకు నిదర్శనంగా నిలిచారు.
ఇక గతేడాది టెంపుల్ డిజైన్‌తో నలుపు, బంగారు వర్ణాల అంచుతో ఎరుపు రంగు చీరలో ఆకట్టుకున్నారు. ఇక ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో టస్సర్ హ్యాండ్లూమ్ బ్లూ, క్రీమ్ కలగలిపిన చేనేత చీరను ఎంచుకున్నారు. ఈ కలర్‌ను ‘రామా బ్లూ’ అని పిలుస్తారు. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్టకు ప్రతీకగా ఆమె ఈ చీరను ధరించారు.
Also Read..
Union Budget 2024-25 | లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
Nirmala Sitharaman | ఏడోసారి బడ్జెట్.. రికార్డు బ్రేక్ చేసిన నిర్మలమ్మ
Budget 2024 | బడ్జెట్‌కు ముందు.. నిర్మలమ్మ నోరు తీపి చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

