Union Budget : కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ ప్రసంగం చేస్తున్నారు. ఈ బడ్జెట్ సమర్పణ ద్వారా ఆమె పార్లమెంట్లో వరుసగా 7 సార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా ప్రత్యేక గుర్తింపు దక్కించకున్నారు.
వచ్చే ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చేలా నైపుణ్యాభివృద్ధి సంస్థలను అభివృద్ధి చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ ఇస్తామని తెలిపారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంపు చేస్తామని ప్రకటించారు.