KTR | లాస్య నందిత భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం.. భావోద్వేగానికి లోనైన కేటీఆర్
KTR | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లాస్య నందిత భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం.. కానీ ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకే మరణించడం బాధాకరమని కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
KTR | హైదరాబాద్ : కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపట్ల శాసనసభ సంతాపం ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. లాస్య నందిత భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం.. కానీ ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజులకే మరణించడం బాధాకరమని కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.
ఓ యువ శాసనసభ్యురాలు అనుకోని పరిస్థితిలుల్లో మరణించారు. కొన్ని సందర్భాలు దిగ్భ్రాంతినిక కలిగిస్తాయి. 5 సార్లు గెలుపొందిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న మృదు స్వభావి. ఆయన అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్ నాయకత్వంలో సాయన్న కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి చేశారు. సాయన్న, ముఠా గోపాల్ చిరకాల స్నేహితులు.. వారిద్దరి మధ్య దశాబ్దకాలంగా స్నేహం ఉంది. 2015లో జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు కవాడిగూడ నుంచి లాస్య నందితను కార్పొరేటర్‌గా చూడాలని ఉందని కేసీఆర్‌ను సాయన్న కోరారు. కేసీఆర్ కాదనకుండా.. ఆమెకు అవకాశం ఇచ్చారు. లాస్య నందిత కూడా గెలుపొందారని కేటీఆర్ గుర్తు చేశారు.
సాయన్న కుటుంబాన్ని చూస్తుంటే విధి పగబట్టిందేమో అన్న విధంగా ఉంది. సాయన్న, లాస్య నందిత ఒకే ఏడాదిలో దుర్మరణం చెందారు. ఇవి ఆవేదన కలిగించే అంశాలు. ఆ కుటుంబంలో ఎంతో విషాదం నెలకొంది. నందిత చలా చురుకైన అమ్మాయి. సాయన్న ఆరోగ్యం బాగాలేనప్పుడు.. ఇద్దరు కుమార్తెలు నందిత, లాస్య నివేదిత ఆయనతో ఎల్లవేళలా ఉండేవారు. ఇద్దరు అమ్మాయిలు కుడి ఎడమ భుజం మాదిరిగా ఉండేవారని పేర్కొన్నారు కేటీఆర్.
ఇదే శాసనసభలో కేసీఆర్ సీఎంగా సాయన్న సంతాప తీర్మానం ప్రవేశపెట్టడమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. 2018 ఎన్నికల్లో లాస్య నందితకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం. నందిత తన తండ్రి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలిచింది. గెలుపొందిన కొద్ది కాలానికే నల్లగొండలో మా పార్టీ సభ జరిగితే వచ్చింది. ఆ రోజు ఆమె స్వల్ప గాయాలతో బయటపడింది. కారు ధ్వంసమైంది. ఆ తర్వాత లిఫ్ట్‌లో ఆమె ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో నందిత మరణించిందని కేటీఆర్ తెలిపారు.
లాస్య నందిత మరణిస్తే తిరిగి వారి సోదరి నివేదితకు ఉప ఎన్నికల్లో అవకాశం ఇచ్చాం. దురదృష్టావశాత్తు ఆమె ఓటమి పాలైంది. మంచి విద్యార్హతలు కలిగిన లాస్య నందిత ఈ సభలో అడుగపెట్టిందని సంతోషించాం. భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని ఆశించాం. ఆమెకు సంతాపంగా మాట్లాడాల్సి వస్తుందని ఎవరూ ఊహించలేదు. సాయన్న కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాం.. భవిష్యత్‌లో కూడా సంపూర్ణంగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Nirmala Sitharaman | ఏడోసారి బడ్జెట్.. రికార్డు బ్రేక్ చేసిన నిర్మలమ్మ
Union Budget 2024-25 | లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
Budget 2024 | బడ్జెట్‌కు ముందు.. నిర్మలమ్మ నోరు తీపి చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

