సూర్యాపేట : కనకదుర్గమ్మకు జగదీష్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పూజలు చేశారు. సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని జేజే నగర్లో గల శ్రీ కనకదుర్గమ్మ(Kanakadurgamma) అమ్మవారి దేవాలయంలో శుక్రవారం మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి(MLA Jagadish Reddy) తన సతీమణి సునీతా జగదీష్ రెడ్డి, సోదరీమణి కట్టా రేణుకా శేఖర్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పేరుమాళ్ల అన్నపూర్ణతో కలిసి ప్రత్యేక పూజలు(Worships )నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనం చేశారు. అనంతరం కమిటీ సభ్యులు శాలువా, పట్టు వస్త్రాలతో సత్కరించారు. ప్రజలు పాడి, పంటలతో సంతోషంగా జీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.