MLA Jagadish Reddy | హైదరాబాద్ : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞత కోల్పోయి మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాష మాట్లాడితే ముఖ్యమంత్రి కాలేరు.. ఉన్న గౌరవం పోతదని భట్టికి జగదీశ్ రెడ్డి చురకలంటించారు. తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని గురుకుల హాస్టళ్లలో విషాహారం తిని పిల్లలు చనిపోతుంటే, వందలాది మంది ఆస్పత్రి పాలవుతుంటే ప్రభుత్వంలో చలనం లేదు. దీనికి కూడా కూడా కేసీఆర్, కేటీఆర్ కారణం అని భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. 9 నెలల కింద వండిన భోజనాన్ని మీరు ఇప్పుడు పెడుతున్నారా..? అని భట్టిని ప్రశ్నించారు. భట్టి విక్రమార్క కూడా విజ్ఞతను కోల్పోయి మాట్లాడుతున్నారు. రేవంత్ భాష మాట్లాడితే, ఆయన లాగా అబద్దాలు మాట్లాడితేనే సీఎం అవుతానని భట్టి విక్రమార్క అనుకుంటున్నారేమో..? పాపం సీఎం కాలేరు.. కానీ ఉన్న గౌరవం పోతది. హాస్టల్స్‌లో పరిశుభ్రతకు బీఆర్ఎస్ కారణమని మాట్లాడుతున్నారు. నువ్వు ముఖం కడుక్కోకుండా మీరు కారణమని మాట్లాడడం సరికాదని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థమై మాట్లాడుతాడు లేదో అర్థం కావడం లేదు. సీతారామ ప్రాజెక్టుకు మేం అనుమతులు తెచ్చామని అంటున్నారు. ఉత్తమ్ మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారు. 2018లో మొదలైంది ప్రాజెక్టు కరస్పాండెన్స్. వరుసగా నాలుగు సంవత్సరాలు కేంద్రంతో పాటు అన్ని సంస్థలతో మాట్లాడితే అనుమతులు వచ్చాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి భవిష్యత్‌లో తప్పు మాట్లడొద్దు.. అధికారుల వద్ద సమాచారం తీసుకోండి. మీరు అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు సీతారామపై కేంద్రానికి ఒక్క లేఖనైనా రాశారా..? ఇరిగేషన్ రంగంపై నీవు సీఎం అధికారులతో రివ్యూ చేశారా.. మీకు సోయి ఉందా అని జగదీశ్ రెడ్డి నిలదీశారు.
కృష్ణా నదిని అధికారులు కేఆర్ఎంబీకి అప్పజెప్పి వస్తే మీకు సోయి లేదు. ప్రమాదం జరుగుతుందని హరీశ్‌రావు గ్రహంచి మీకు సూచనలు చేశారు. అప్పుడు నిద్ర మేల్కొని జరిగిన తప్పు సరి చేసుకుంటే పోయేది.. కానీ బీఆర్ఎస్ మీద తిరగబడ్డారు. చివరకు కేసీఆర్ గర్జిస్తే అసెంబ్లీలో తీర్మానం పెట్టారు.. కృష్ణా నదిని మేం కేఆర్ఎంబీకి అప్పజెప్పడం లేదని. ఆ తర్వాత మీరు మాట్లాడిన ప్రతి అక్షరం అబద్ధమే అని తేలిపోయింది. ప్రాజెక్టుల విషయంలో కూలిపోయింది కారిపోయింది అని అంటున్నారు. మీ కండ్ల ముందు కూలిపోయిన దాని మీద ఇప్పటి వరకు చర్యలు లేవు. ఏం మతలబు జరుగుతుంది అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి..
Mahalakshmi free bus | ఆర్టీసీ బస్సుల్లో అమ్మాయిలకు అవమానం.. బూతులు తిడుతున్న కండక్టర్
KA Paul | ఖాళీ చేతులతో రేవంత్ రెడ్డి వచ్చాడు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు