Mahalakshmi free bus | ఆర్టీసీ బస్సుల్లో అమ్మాయిలకు అవమానం.. బూతులు తిడుతున్న కండక్టర్
Mahalakshmi free bus | ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం.. అమ్మాయిలను అవమానించేలా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా అమ్మాయిలు, మహిళలు ఆధార్ కార్డు చూపించాలనే నిబంధనను ఆర్టీసీ యాజమాన్యం విధించింది. ఇక ఆధార్ కార్డు చూపించి మహిళలు, విద్యార్థినులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
Mahalakshmi free bus | రంగారెడ్డి : ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం.. అమ్మాయిలను అవమానించేలా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా అమ్మాయిలు, మహిళలు ఆధార్ కార్డు చూపించాలనే నిబంధనను ఆర్టీసీ యాజమాన్యం విధించింది. ఇక ఆధార్ కార్డు చూపించి మహిళలు, విద్యార్థినులు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు.
అయితే కొంతమంది కండక్టర్లు అమ్మాయిల పట్ల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ లేదంటూ.. కార్డుపై ఉన్న ఫొటో సరిగా లేదంటూ సాకులు చెబుతూ.. అమ్మాయిలను నోటికొచ్చినట్లు తిడుతున్నారు కండక్టర్లు. కొంతమంది కండక్టర్లు అయితే నిర్దాక్షిణ్యంగా మార్గమధ్యలోనే విద్యార్థినులను బస్సుల్లో నుంచి కిందకు దించేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసీ బస్సు నడుస్తుంది. అయితే ఆ బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థినులు చదువుకోవడానికి షాద్‌నగర్ ప్రాంతానికి వెళ్లి వస్తుంటారు. అయితే విద్యార్ధినుల పట్ల ఓ బస్ కండక్టర్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఆధార్ కార్డులో ఫొటో సరిగా లేదంటూ, టికెట్ తీసుకోవాలని బూతు మాటలు తిడుతూ ఉంటారని విద్యార్థినులు అవేదన వ్యక్తం చేశారు. ఆధార్ అప్డేట్ లేకపోయినా, బ్యాగ్‌లో నుండి ఆధార్ బయటకు తీయడంలో ఆలస్యమైనా బండబూతులు తీట్టి మధ్యలోనే బస్సును ఆపి దింపి వేస్తున్నాడని బాధిత అమ్మాయిలు వాపోయారు.
కండక్టర్ ప్రవర్తనతో విసిగిపోయిన బాధిత విద్యార్థినులు షాద్‌నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్‌కు ఇవాళ ఫిర్యాదు చేశారు. అమ్మాయిలని చూడకుండా బూతులు మాట్లాడుతున్న కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేశారు. విచారణ అనంతరం సదరు కండక్టర్‌పై తప్పకుండా చర్యలు తీసుకుంటామని డిపో మేనేజర్ తెలిపారు.
ఆడ పిల్లలు అని చూడకుండా బూతులు తిడుతున్న ఆర్టీసీ బస్ కండక్టర్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నుండి కేశంపేట మండలంలోని సంగెం గ్రామానికి ఉదయం సాయంత్రం వేళల్లో ఆర్టీసి బస్సు నడుస్తుంది.
అయితే ఆ బస్సులో ఆయా గ్రామాల నుండి విద్యార్థి, విద్యార్థినిలు చదువుకోవడానికి షాద్ నగర్ ప్రాంతానికి… pic.twitter.com/KRMHtUDeUN
— Telugu Scribe (@TeluguScribe) August 14, 2024
ఇవి కూడా చదవండి..
KA Paul | ఖాళీ చేతులతో రేవంత్ రెడ్డి వచ్చాడు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gas cylinder | మేడ్చల్‌లో పేలిన గ్యాస్ సిలిండర్ .. తృటి తప్పిన పెను ప్రమాదం
Katrina Kaif | దీపావళికి కత్రినా కైఫ్ స్పెషల్ గిఫ్ట్.. తొలిసారి కొడుకు విహాన్ ఫొటో షేర్ చేసిన స్టార్ కపుల్!
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

