MLA Jagadish Reddy | హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కిరణ్ రెడ్డిదే బలహీన ప్రభుత్వం అనుకున్నాం.. కానీ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంతకు మించిన బాధ్యతరాహిత్య పాలన వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. గడిచిన ఎనిమిది నెలల కాలంలో వీధుల్లో పిచ్చి కుక్కలు ప్రజల్ని కరుస్తుంటే, కనకపు సింహాసనాల మీద కూర్చున్నవేమో ఇచ్చిన హామీలు నెరవేర్చమని ప్రశ్నిస్తే ప్రతి పక్షాన్ని కరుసున్నాయి అంటూ జగదీశ్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్లో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ నేతలకు హామీలు ఇచ్చుడు, ఒట్లు పెట్టుడు ఒడిసిపోయాయి. ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారు. కాంగ్రెస్ మంత్రులు భుజాలు తడుముకుని సమాధానాలు చెప్పలేక ఏడ్చే పరిస్థితి వచ్చింది. చివరి రోజుల్లో వస్తది అనుకున్నాం కానీ ప్రారంభంలోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఒక పరిపాలకుడికి 9 నెలలు అనేది తక్కువ సమయం కాదు. పథకాల అమలుకు డెడ్లైన్లు పెట్టుకున్నారు.. కానీ డెడ్లైన్లు అయిపోయాయి.. పథకాలు అమలు కాలేదు. ఇప్పుడు మాట మార్చి మాట్లాడుతున్నారు. రుణమాఫీ విషయంలో రూ. 41 వేల కోట్లు అని చెప్పి, రూ. 39 వేల కోట్లకు తెచ్చారు. దాన్ని రూ. 36 వేల కోట్లు చేసి, ఆఖరికి రూ. 12 వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు అని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.
మీరు ఎన్ని స్టోరీలు రాసుకున్నా. రాయించుకున్నా ప్రజల జేబుల్లోకి పైసలు పోవడం లేదు. హరీశ్‌రావు ఏమన్నడని మంత్రి బాధపడాలి.. కుమిలిపోవాలి. సీతారామ ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశాం. బటన్ నొక్కే అదృష్టం మీకొచ్చింది. మీరు అదృష్టవంతులు అని హరీశ్‌రావు చెప్పారు. బటన్ నొక్కేటప్పుడు ఇది కేసీఆర్ కష్టం అని చెప్పాలని ఒక మాట సూచించారు. దానికి ఉలిక్కిపడి అన్ని అనుమతులు మేమే తెచ్చాం అని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. హరీశ్‌రావు మాటలు బాధ కలిగించాయన్నారు. అసలు హరీశ్‌రావు ఒక్క బూతు మాట కూడా మాట్లాడలేదు అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Mahalakshmi free bus | ఆర్టీసీ బస్సుల్లో అమ్మాయిలకు అవమానం.. బూతులు తిడుతున్న కండక్టర్
KA Paul | ఖాళీ చేతులతో రేవంత్ రెడ్డి వచ్చాడు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు