నల్లగొండ : తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి కాళోజీ నారాయణరావు (Kaloji) అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. నల్లగొండ (Nallagonda) జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కాళోజీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు(Tribute) అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అన్యాయం ఉన్న చోట తిరుగుబాటు.. ప్రశ్నించే గొంతుక అలవాటు చేసుకోండని అంటూ పిలుపునిచ్చిన మహనీయుడు కాళోజీ అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో కాళోజీకి మంచి గుర్తింపు వచ్చేలా చేశాం. కాళోజీ పేరుతో కళాక్షేత్రం, విద్యాలయం ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. కాళోజీ ఆశయాలకు అనుగుణంగా మనం నడువడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి అన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తులు, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
KCR | బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ: కేసీఆర్
KTR | కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం: కేటీఆర్
Nalimela Bhaskar | సాహితీవేత్త నలిమెల భాస్కర్‌కు కాళోజీ పురస్కారం