KTR | కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం: కేటీఆర్
KTR | తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు.
KTR | తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పించారు. ఎక్స్ వేదికగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘మన కాళోజీ ‘గొడవ’ ప్రజల గొడవ. అచ్చమైన తెలంగాణ వాడుక భాషలో కాళోజీ నారాయణరావు చేసిన రచనలు మాటల తూటాలు. నిరంకుశత్వంపై, అరాచక పాలనపై, అసమానతలపై విమర్శనాస్త్రాలు. ప్రతినిత్యం సామాన్యుల సమస్యలనే, హక్కుల పరిరక్షణే, ప్రజా శ్రేయస్సునే తన జీవితంగా భావించిన తెలంగాణ వైతాళికుడు కాళోజీ. ప్రజాకవిగా పేరొందిన కాళోజీ స్వాతంత్ర్య సమరయోధునిగా, తెలంగాణ ఉద్యమకారునిగా అందించిన స్ఫూర్తి, చేసిన సేవలు అనిర్వచనీయం.
మన కాళన్న గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే మహోన్నత ఉద్దేశంతోనే కేసీఆర్ గారు కాళోజీ గారి జయంతిని (సెప్టెంబర్ 9) తెలంగాణ భాషా దినోత్సవంగా నిర్వహించారు. వైద్య విశ్వవిద్యాలయానికి వారి పేరు పెట్టారు. వరంగల్లో సుందరమైన కాళోజీ కళాక్షేత్రాన్ని నిర్మించారు. ధిక్కార స్వరం కాళోజీ తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం. కాళోజీ కలం.. సామాన్యుల గళం.. ప్రజలకు బలం.’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
మన కాళోజీ ‘గొడవ’ ప్రజల గొడవ.
తెలంగాణ భాష బడి పలుకుల భాష కాదు, పలుకుబడుల భాష అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు కాళోజీ.
అచ్చమైన తెలంగాణ వాడుక భాషలో కాళోజీ నారాయణరావు గారు చేసిన రచనలు మాటల తూటాలు. నిరంకుశత్వంపై, అరాచక పాలనపై, అసమానతలపై విమర్శనాస్త్రాలు.
ప్రతినిత్యం సామాన్యుల సమస్యలనే,… pic.twitter.com/Ryy1ZkqKu7
— KTR (@KTRBRS) September 9, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

