సంగారెడ్డి : బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్లో చేరిన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి (MLA Goodem Mahipal Reddy)సొంత పార్టీ నేతల నుంచే ప్రతిఘటన ఎదురవుతున్నది. తాజాగా ఐడీఏ బొల్లారంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని సొంత పార్టీ నాయకులు(Congress leaders) అడ్డుకున్నారు. బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడానికి మహిపాల్ రెడ్డి వెళ్లారు. అయితే శిలాఫలకాలపై కొంతమంది పేర్లు లేకపోవడంతో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కార్యక్రమాన్ని బై కాట్ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సర్దిచెప్పటంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఇవి కూడా చదవండి..