కొత్తపల్లి, జనవరి 8: రాజకీయ కక్షసాధింపులో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేస్తోందని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(MLA Gangula) విమర్శించారు. బుధవారం ఆయన కరీంనగర్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడారు. అధికారం ఉందని.. బీఆర్ఎస్ నాయకులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ కాంగ్రెస్ భయాందోళనలకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టిన భయపడే ప్రసక్తే లేదన్నారు.
న్యాయస్థానాలపై తమకు అపారమైన నమ్మకం ఉందన్నారు. ఈ కార్ రేసులో కేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఫార్ములా రేస్ (Formula E race)ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ని పెంచే విధంగా కేటీఆర్ కృషి చేశారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు తోట రాములు, బోనాల శ్రీకాంత్, నాంపల్లి శ్రీనివాస్, దిండిగాల మహేశ్, కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీపీ తిరుపతినాయక్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Group-3 | గ్రూప్-3 ప్రాథమిక కీ విడుదల చేసిన టీజీపీఎస్సీ
KTR | ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్ వెళ్లొచ్చు.. కానీ
Harish Rao | కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసు.. ప్రశ్నించే గొంతుక మీద పెట్టిన కేసు : హరీశ్‌రావు