Group-3 | హైదరాబాద్ : గ్రూప్-3 పరీక్షకు సంబంధించి టీజీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన కీని టీజీపీఎస్సీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్‌లో అందుబాటులో ప్రాథమిక కీని ఉంచినట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు. ఈ నెల 12వ తేదీ వరకు గ్రూప్-3 కీ అందుబాటులో ఉండనుంది. ఇక అభ్యంతరాలను ఆంగ్ల భాషలోనే తెలపాలని అధికారులు సూచించారు. నవంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు కేవలం 50 శాతం మంది మాత్రమే హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఏసీబీ విచారణకు కేటీఆర్ వెంట లాయర్ వెళ్లొచ్చు.. కానీ
Harish Rao | కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసు.. ప్రశ్నించే గొంతుక మీద పెట్టిన కేసు : హరీశ్‌రావు
King Fisher Beers | మందు బాబులకు షాక్.. తెలంగాణకు కింగ్ ఫిషర్ బీర్ల సరఫరా నిలిపివేత