నిజమాబాద్ : జిల్లాలోని వేల్పూర్ మండల కేంద్రంలో రూ.50 లక్షల ఎమ్మెల్యే సిడిపి నిధులతో నూతనంగా నిర్మించిన ప్రజా కల్యాణ మండపాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..నేటి పరిస్థితుల్లో పేదవారు పెండ్లి చేయాలంటే ఫంక్షన్ హాల్ కోసం వేళల్లో ఖర్చు చేయాల్సి పరిస్థితి ఉంది.
ఇలాంటి పరిస్థితుల్లో గ్రామంలో ఉన్న పేదవారు అతి తక్కువ ఖర్చుతో పెండ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో సిడిపి నిధుల నుంచి 50 లక్షలు మంజూరు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు ప్రజలందరికి అందుతున్నాయన్నారు. ఈ కల్యాణ మండపం నిర్వహణ బాధ్యతలు గ్రామ పంచాయతీకి అప్పజెప్పుతు మండపం తాళాలు సర్పంచ్, ఆర్డీఓకి మంత్రి అందజేశారు.
అలాగే మంత్రి వేముల నానమ్మ, తాతయ్యల పేర్ల మీదుగా పేద ప్రజలకు ఇబ్బంది ఉండకుండా కల్యాణ మండపంలో అవసరమైన కుర్చీలు, బల్లలు, వంట సామగ్రి మొత్తం రూ.5 లక్షలు తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
జయశంకర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. పెండ్లి బృందం వాహనం వెంట పరుగులు
బీజేపీని గద్దె దించడమే మా లక్ష్యం : పల్లా రాజేశ్వర్రెడ్డి
Rajanna siricilla | శివనామ స్మరణతో మార్మోగిన రాజన్న ఆలయం