హైదరాబాద్ : సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని(Ryhu bharosa) వర్తింపచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala )అన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన రైతు భరోసా పథకం నిధులు.. జిల్లాలో ప్రతి మండలానికి ఒక్కో గ్రామం చొప్పున మొదట విడుదల చేశామన్నారు.
విడుదల చేసిన నిధులు సోమవారం రైతుల అకౌంట్లలో జమ చేయబడ్డాయన్నారు. మొత్తంగా 32 జిల్లాలలోని రైతుల వారి వారి ఖాతాలలో రూ.569 కోట్లు జమ చేశామన్నారు. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఒక్క రైతుకు రైతు భరోసాని అందజేస్తామని మంత్రి హామీనిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేసే ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..